Nara Lokesh fires on ycp: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల విధ్వంసానికి సీఎం జగన్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. పల్లె పోరులో ఫ్యాన్‌కు ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి విద్యుత్ బకాయిలంటూ.. రూ.345 కోట్లు నిలిపేశారని ఆరోపించారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లను.. ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టించడం గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమేనని మండిపడ్డారు.