తెలంగాణ

telangana

ETV Bharat / city

Lokesh Fire on Ysrcp Govt: 'జగన్ నిర్ణయాల వల్ల చేనేత రంగం కుదేలు' - నేతన్నల ఆత్మహత్యలు న్యూస్

Lokesh Fire On YSRCP Govt: ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల చేనేత రంగం కుదేలై.. చేనేత కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయని తెదేపా నేత నారా లోకేశ్ వాపోయారు. వైకాపా పాలనలో సంక్షేమ ఫలాలు అందకపోవటం వల్లే నేతన్నల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Lokesh
Lokesh

By

Published : Feb 1, 2022, 5:11 PM IST

Lokesh Fire on Ysrcp Govt: వైకాపా పాలనలో సంక్షేమ ఫలాలు అందకపోవటం వల్లే నేతన్నల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. చేనేత రంగం కుదేలయ్యేలా ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలతో కలిసి నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

అప్పుల భారం పెరిగి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకనే కృష్ణా జిల్లా పెడనలో నేతన్న కాచన పద్మనాభం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో నేతన్నకు ఏడాదికి సుమారు రూ.50 వేలకు పైగా వచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను వైకాపా ప్రభుత్వం నిలిపేసిందని ధ్వజమెత్తారు. రూ.24 వేలు చేతిలో పెట్టి సరిపెట్టుకోమంటున్నారని, సొంత మగ్గం ఉన్న వారికే నేతన్నహస్తం వర్తించేలా నిబంధనలు పెట్టారని మండిపడ్డారు.

ఆప్కో కొనుగోళ్లు ఆగిపోవడంతో పాటు మజూరీ, రాయితీలు నిలిచిపోయాయని ఆక్షేపించారు. సొంతంగా మగ్గం ఏర్పాటుకు సాయం లేదని, ప్రతి నేత కార్మికునికి ప్రభుత్వ పథకాలు అందించటంతో పాటు అదనంగా గతంలో తెదేపా ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలు కొనసాగించి ఆత్మహత్యలు నివారించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:రాష్ట్రాలకు లక్ష కోట్ల సాయం- వడ్డీ లేని రుణం!

ABOUT THE AUTHOR

...view details