Lokesh on CM Jagan: ఏపీ శాసనసభలో తన తల్లిపై చేసిన వ్యాఖ్యల అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. మూడు రాజధానుల బిల్లును తెరపైకి తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లాలో (nara Lokesh guntur tour)కరోనాతో మృతిచెందిన కార్యకర్తల కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.
' ఏపీ శాసనసభలో నా తల్లిని అవమానించారు. ఆ అంశం నుంచి జనం దృష్టి మళ్లించేందుకే మళ్లీ మూడు రాజధానుల రాగాన్ని సీఎం జగన్ ఆలపిస్తున్నారు.'
- నారా లోకేశ్ , తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
మహిళలు పలు సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా.. ఇంత వరకూ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని లోకేశ్‌తో మహిళలు అన్నారు. అభివృద్ధి పేరుతో తమ ఇళ్లను తొలగిస్తున్నారని వాపోయారు. స్పందించిన లోకేశ్.. ప్రజల గురించి ఒక్క తెదేపానే ఆలోచిస్తుందని.. వారి సమస్యలపై పోరాడుతోందని చెప్పారు. అయితే.. ఒక సమస్యపై పోరాడి, దానికి పరిష్కారం వచ్చే లోపే.. ప్రభుత్వం మరో సమస్యను తెర పైకి తెచ్చిపెడుతోందని విమర్శించారు.
ఏపీలో అభివృద్ధి పడకేసిందన్న లోకేశ్.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? అని నిలదీశారు. కడప జిల్లాలో భారీ వరదలు వచ్చి 41 మంది చనిపోయినా.. ఇంతవరకూ సీఎం ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు.
ఇదీచూడండి:Revanth fires on trs: 'ప్రజాస్వామ్యం ఖూనీ అయింది.. ఇది కల్వకుంట్ల రాజ్యాంగమా?'