ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్కాపురంలో తెదేపా కార్యకర్త గొల్ల గోపాల్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. వైకాపా నేతలే గోపాల్‌ను హత్య చేశారని ఆయన ఆరోపించారు. మృతుని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
Lokesh:'ప్రశాంత రాష్ట్రాన్ని హత్యారాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు' - నారాా లోకేశ్ తాజా వార్తలు
ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను వైకాపా నేతలు హత్యారాజకీయాలకు కేంద్రంగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాలో తెదేపా కార్యకర్త గొల్ల గోపాల్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
![Lokesh:'ప్రశాంత రాష్ట్రాన్ని హత్యారాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు' tdp leader fires on ycp government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12064015-851-12064015-1623165167966.jpg)
tdp leader fires on ycp government
అధికారం చేతుల్లో ఉందని వైకాపా నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. తెదేపా హయాంలో అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తే..వైకాపా పాలనలో హత్యలు, దోపిడీలు, అరాచకాలే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని హత్యా రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారని దుయ్యబట్టారు.