రెండు రోజుల పర్యటన నిమిత్తం లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా ఏపీలోని చిత్తూరు జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న ఆయన.. 1.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. తిరుమల శ్రీకృష్ణ వసతిగృహంలో స్పీకర్ ఓం బిర్లా బస చేస్తారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా - తిరుమల వార్తలు
లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా రేపు తిరుమలకు రానున్నారు. ముందుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం తిరుమల చేరుకుని మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఓంప్రకాశ్ బిర్లా
మంగళవారం ఉదయం విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనానంతరం పద్మావతి వసతి గృహంలో తితిదే అధికారులతో సమీక్షించనున్నారు. తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శించిన తర్వాత.. తిరుపతి కపిలేశ్వర స్వామిని, శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని ఓం బిర్లా దర్శించుకుంటారు. ఈ మేరకు.. అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి:Independence Day: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు