ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో మిడతలదండు ఆందోళనకు గురిచేస్తోంది. పిఠాపురం పట్టణంలోని రైల్వేగేటు వద్ద భారీగా మిడతలు వచ్చి జిల్లేడు మొక్కలను తినేస్తున్నాయి. మిడతల దండు మొక్కలపై వాలిన నిమిషాల వ్యవధిలోనే మొత్తం తినేయడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
నిమిషాల్లో మోడుగా మారుస్తున్న మిడతలు - మిడతల దండు తాజా వార్తలు
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో మిడతల దండు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని పిఠాపురం పట్టణంలోని రైల్వేస్టేషన్ పక్కనున్న జిల్లేడు చెట్లకు ఒక్క ఆకు కూడా కనిపించకుండా తినేయటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
నిమిషాల్లో మోడుగా మారుస్తున్న మిడతలు
రైలు పట్టాల పక్కనున్న మొక్కలు క్షణాల వ్యవధిలో ఒక్క ఆకు కూడా లేకుండా బోసిపోయాయి. పచ్చటి మొక్కలు కళ్ల ముందే మోడుగా మారడం పట్ల స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా