ఏపీలోని విశాఖ జిల్లా కశింకోట మండలం అచ్చెర్ల శివారు గోకివానిపాలెంలో మిడతల దండు అలజడి స్పష్టించింది. స్థానిక కొండలరావు అనే రైతుకు చెందిన జీడి మామిడి తోటలో భారీగా మిడతలు కనిపించాయి. ఉత్తర భారత్లో విధ్వంసం స్పష్టిస్తున్న ఎడారి మిడతలు ఇక్కడికి వచ్చాయనుకొని భయపడిన రైతు... అధికారులకు సమాచారం అందించాడు. ఉద్యానవన శాఖ అధికారులు తోటకు చేరుకొని పరిశీలించారు. మిడతలను నిశితంగా పరిశీలించి ఇతర రాష్ట్రాల శాస్త్రవేత్తలకు ఫోటోలు పంపి వివరాలు అడిగారు. అయితే ఇవి గడ్డి మిడతలని... భయపడాల్సిన అవసరం లేదని అనకాపల్లి ఉద్యాన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత తెలిపారు.
విశాఖ జిల్లాలో మిడతల దండు అలజడి - ఏపీలో మిడతల దాడి
ఏపీలోని విశాఖ జిల్లా కశింకోట మండలంలోని జీడి తోటల్లో మిడతలు గుంపులుగా కనిపించాయి. తోటలోని చెట్లపై వాలి ఆకుల్ని తినేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి మిడతలు వచ్చాయనుకొని భయాందోళనకు గురైన రైతు.. అధికారులకు సమాచారమిచ్చాడు.
![విశాఖ జిల్లాలో మిడతల దండు అలజడి locust-were-spotted-in-visakha-district of andhra pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7386808-519-7386808-1590682038421.jpg)
విశాఖ జిల్లాలో మిడతల దండు అలజడి
విశాఖ జిల్లాలో మిడతల దండు అలజడి