కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు ఆగస్టు నెల 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల దశల వారీగా నిబంధనలు ఎత్తివేయనున్నారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్ కేంద్రాలు, మెట్రో రైళ్ల రాకపోకలు, సినిమా థియేటర్లు, ఈత కొలనులు, పార్కులు, బార్ల మూసివేత కొనసాగనుంది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల యోగా కేంద్రాలు, జిమ్‌లు నేటి నుంచి ప్రారంభించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈనెల 31 వరకు లాక్డౌన్ ఆంక్షలు.. దశలవారీగా నిబంధనలు ఎత్తివేత - ఆగస్టు 31 వరకు లాక్డౌన్
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ... ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ ఆంక్షలు పొడింగించింది. ఈ నెల 31 వరకు కొనసాగుతాయని ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల దశల వారీగా నిబంధనలు ఎత్తివేయనున్నారు.
సరుకు రవాణతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలకు ఎటువంటి ఆంక్షలు ఉండవని అధికారులు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజలు భారీ ఎత్తున గుమిగూడడంపై నిషేధం కొనసాగతుంది. అయితే వివాహ, శుభకార్యాలు మాత్రం 50 మందికి మించకుండా జరుపుకోవచ్చని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా మృతి చెందితే... అంతిమయాత్రల్లో ఇరవై మందికి మించకూడదని వివరించారు. వృద్ధులు, చిన్నారులు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.
ఇదీ చూడండి:కేజ్రీ ప్రభుత్వ నిర్ణయానికి ఎల్‌జీ బ్రేక్