తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..! - హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్

జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా విజృంభణ దృష్ట్యా తిరిగి మరికొన్ని రోజులు లాక్​డౌన్​ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జీహెచ్​ఎంసీ పరిధిలో వైరస్‌ విజృంభణపై సుదీర్ఘంగా చర్చించారు. ఎక్కువ పాజిటివ్‌ కేసులు వచ్చినంత మాత్రాన ఆందోళనకు గురికావాల్సిన అవసరం ఏమీ లేదని కేసీఆర్​ భరోసానిచ్చారు.

lock down
హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

By

Published : Jun 29, 2020, 5:18 AM IST

జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి కట్టడికి కొద్ది రోజులపాటు లాక్‌డౌన్‌ విధించాలని..... రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ పాజిటివ్‌ కేసులు వచ్చినంత మాత్రాన ఆందోళనకు గురికావాల్సిన అవసరం ఏమీ లేదని కేసీఆర్​ భరోసానిచ్చారు. అందరికీ సరైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జీహెచ్​ఎంసీ పరిధిలో వైరస్‌ విజృంభణపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్రజల కదలికలు భారీగా పెరగడం..

జీహెచ్​ఎంసీ పరిధిలో పరిస్థితిని మంత్రి ఈటల రాజేందర్‌ వివరించారు. రాజధాని పరిధిలో మరోసారి 15 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని వెల్లడించారు. స్పందించిన సీఎం.. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న క్రమంలో ఇక్కడా అదే పరిస్థితి ఉండటం సహజమని చెప్పారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత.. ప్రజల కదలికలు భారీగా పెరగడంతో వైరస్‌ విస్తరణ ఎక్కువగా ఉందన్నారు.

ఇతర నగరాలు సైతం

చెన్నైలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారన్న కేసీఆర్‌.. ఇతర నగరాలు సైతం అదే దిశగా ఆలోచిస్తున్నాయని తెలిపారు. జీహెచ్​ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించాలంటే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పారు. నిత్యావసర సరకుల కొనుగోలుకు ఒకటి, రెండు గంటలు సడలింపు ఇచ్చి రోజంతా లాక్​డౌన్​ అమలుచేయాల్సి ఉంటుందన్నారు.

మంత్రిమండలి భేటీ..

విమానాలు, రైళ్ల రాకపోకలు ఆపాల్సి ఉంటుందని... ప్రభుత్వపరంగా అన్ని సిద్ధం చేయాల్సి ఉంటుందని అన్నారు. రెండు, మూడు రోజుల పాడు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తామన్న సీఎం... అవసరమైతే మూడు, నాలుగు రోజుల్లో మంత్రిమండలిని సమావేశపరుస్తామన్నారు. అన్ని విషయాలు, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుందామని వివరించారు.

ఆందోళన అవసరం లేదు

దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తిస్తోందన్న మంత్రి ఈటల.. రాష్ట్రంలోనూ అదే తరహాలో కేసులు పెరుగుతున్నాయన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉందని.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినవారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది పడకలను... అందుబాటులోకి తెచ్చినట్లు ఈటల తెలిపారు.

ఇవీచూడండి:రాష్ట్రంలో 14,419కు చేరిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details