రాష్ట్రంలో లాక్‌డౌన్ మరో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన... 5 గంటలకు పైగా మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, లాక్‌డౌన్ పొడిగింపు అంశం, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో... జూన్ 9 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు - లాక్‌డౌన్ వార్తలు
![Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు lockdown extension in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11956802-187-11956802-1622380589799.jpg)
18:24 May 30
రాష్ట్రంలో జూన్ 9 వరకు లాక్‌డౌన్
లాక్‌డౌన్ పొడిగింపులో భాగంగా... సడలింపు సమయాన్ని ప్రభుత్వం మరో మూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా.. దాన్ని మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు. ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు కల్పించగా... మ.2 గంటల నుంచి మరుసటి రోజు ఉ.6 గంటల వరకు కఠిన లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్...
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే విద్యార్థుల వ్యాక్సినేషన్‌పై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆర్థిక రంగం కోలుకోవడాన్ని పరిగణనలోకి తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు.
ఇదీ చూడండి: Etela Rajender: హస్తినకు ఈటల.. భాజపాలో చేరిక జూన్ 2 తర్వాతే..!