రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్డౌన్
14:23 May 11
రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్డౌన్
కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా రాష్ట్రంలో రేపట్నుంచి లాక్డౌన్ అమలు కానుంది. పది రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం పది గంటల నుంచి లాక్డౌన్ ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ సమావేశమైంది. కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించింది.
రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత, పరిస్థితులతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను మంత్రివర్గం సమీక్షించింది. అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రేపట్నుంచి రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. రేపు ఉదయం పది గంటల నుంచి లాక్డౌన్ అమలు కానుంది. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. కొవిడ్ టీకా కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని మంత్రివర్గం నిర్ణయించింది.