తెలంగాణ

telangana

ETV Bharat / city

భాగ్యనగరంలో కఠినంగా లాక్​డౌన్ ఆంక్షలు - Hyderabad lock down

హైదరాబాద్​లో లాక్​డౌన్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాదారులపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

లాక్​డౌన్, హైదరాబాద్​లో లాక్​డౌన్

By

Published : May 25, 2021, 1:49 PM IST

లాక్​డౌన్ ఆంక్షలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ నగరంలో లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. లాక్​డౌన్ సమయం 10 గంటలకు పూర్తి కావడంతో అబిడ్స్, కోఠి, నాంపల్లి, ఎంజే మార్కెట్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

సడలింపు సమయం తర్వాత రోడ్లపైకి వస్తున్న వాహనదారులపై కేసు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేశారు. లాక్​డౌన్ సమయంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని.. ఇంట్లోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details