తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో లాక్​డౌన్ 2.0... తాజా నిబంధనలు​ ఇవే..! - లాక్​డౌన్​ 2.0

lock down guidelines for telangana
lock down guidelines for telangana

By

Published : May 11, 2021, 6:36 PM IST

Updated : May 11, 2021, 10:05 PM IST

18:30 May 11

రాష్ట్రంలో లాక్​డౌన్ 2.0... తాజా నిబంధనలు​ ఇవే..!

రాష్ట్రంలో రేపు ఉదయం 10 గంటల నుంచి లాక్​డౌన్​ అమలుకానుంది. మే 12 నుంచి 22 వరకు పదిరోజులు కొనసాగనున్న లాక్​డౌన్​కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల్లో ప్రధానంగా.. రైతులకు, ప్రజా జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సర్కారు పలు మినహాయింపులు ఇచ్చింది. 

లాక్​డౌన్​ 2.0 మార్గదర్శకాలు...

మినహాయింపులు...

  • వ్యవసాయ, అనుబంధ రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు
  • వైద్యం, ఆస్పత్రులు, మెడికల్‌ షాపులకు మినహాయింపు
  • పెట్రోల్‌ పంపులు, శీతల గిడ్డంగులకు మినహాయింపు
  • బ్యాంకింగ్‌ రంగం(బ్యాంకులు, ఏటీఎంలు), మీడియాకు మినహాయింపు
  • ఇ-కామర్స్‌, హోం డెలివరీ సేవలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు
  • పరిశ్రమలు, ప్రాజెక్టుల నిర్మాణ పనులకు మినహాయింపు

అనుమతులు... ఆదేశాలు...

  • కొవిడ్‌ నిబంధనలకు లోబడి తయారీ పరిశ్రమలకు అనుమతి
  • టెలికాం, ఇంటర్నెట్‌, సమాచారం, ఐటీ సేవలకు అనుమతి
  • కనీసం అవసరమైన ఉద్యోగులతో కార్యకలాపాలకు అనుమతి
  • ఉదయం 6 నుంచి 10 వరకు మెట్రో, ప్రజా రవాణా, ఆర్టీసీకి అనుమతి
  • ఉదయం 6 నుంచి 10 వరకు రేషన్‌ దుకాణాలకు అనుమతి
  • ముందస్తు అనుమతితో పెళ్లిళ్లకు గరిష్ఠంగా 40 మందికి అనుమతి
  • అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి
  • యథావిధిగా వంట గ్యాస్‌ సిలిండర్లు సరఫరా
  • గర్భిణీలు, బాలింతలకు ఇంటికే రేషన్‌ సరఫరా
  • నిత్యావసర వస్తువుల అందుబాటు కోసం కమిటీ ఏర్పాటు
  • తాత్కాలిక పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు
  • ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సిబ్బందికి పూర్తి వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు

మూసివేత...

  • సినిమా హాళ్లు, క్లబ్బులు, జిమ్‌లు, ఈతకొలనులు, వినోద పార్క్‌లు, క్రీడా మైదానాలు మూసివేత
  • మతపరమైన ప్రార్థనా స్థలాలు, అంగన్వాడీ కేంద్రాలు మూసివేత
  • ఈనెల 21 వరకు పాస్‌పోర్టు సేవలు నిలిపివేత

కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు..

  • మే 20న కేబినెట్‌ తిరిగి సమావేశం అవుతుంది. లాక్‌డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి తదుపరి నిర్ణయం
  • యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సిన్ ప్రొక్యూర్‌మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు
  • ప్రభుత్వ రంగంతో పాటు, ప్రైవేట్​లోనూ రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందుల కొరత రాకుండా చూడాలని సీఎస్​కు ఆదేశాలు
  • అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం
  • రోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం
  • 33 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు నడవాలని నిర్ణయం

రెమ్​డెసివిర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు. ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుంచి సీఎం కార్యదర్శి, కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు.

ఇదీ చూడండి : 

  • లాక్​డౌన్​ ఎఫెక్ట్​: వైన్సుల ముందు బారులు తీరిన మందుబాబులు

 

Last Updated : May 11, 2021, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details