తెలంగాణ

telangana

By

Published : May 19, 2021, 9:08 PM IST

Updated : May 19, 2021, 9:18 PM IST

ETV Bharat / city

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: తిండి కోసం తిప్పలు.. చెట్ల కిందే పడిగాపులు

కరోనా మహమ్మారి రోగులను మాత్రమే కాదు.. వారికి చేదోడుగా ఉండేందుకు వచ్చిన సహాయకులను ఇబ్బందులకు గురి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుండగా.. ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై దీనంగా గడుపుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడి చికిత్సకోసం వచ్చేవారి సహాయకులు అన్నం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

lock down effect on covid patients attenders
lock down effect on covid patients attenders

తిండి కోసం తిప్పలు.. చెట్ల కిందే పడిగాపులు

మెడికల్‌ హబ్‌గా ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌కు వైద్యం కోసం చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వస్తుంటారు. వాళ్లతో పాటు వచ్చే సహాయకులు చేదోడుగా ఉంటారు. అలా వచ్చే సహాయకుల్లో పేదవాళ్లు.. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినేందుకు ఆహారం, నిలువనీడ, తలదాచుకునే స్థలం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 10గంటలకే హోటళ్లు మూతపడుతుండగా.. అన్నం కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. బాధితులకు ఆస్పత్రుల్లోనే భోజనం లభిస్తుండగా.. సహాయకులు కడుపు మాడ్చుకుంటున్నారు. కాస్త చదువు వచ్చి, జేబులో ఎంతోకొంత ఉన్నవాళ్లు ఆన్‌లైన్‌లో ఆహారం తెప్పించుకొని తింటున్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి ఇవేమీ తెలియని వాళ్లు.. దాతలపైనే ఆధారపడుతున్నారు.

సగం తిని సగం దాచుకుని...

కడప జిల్లాకు చెందిన పార్వతి అనే మహిళ భర్తకు క్యాన్సర్‌ రావడంతో... బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రికి వచ్చారు. కొద్ది రోజులుగా అక్కడే వైద్యం చేయిస్తున్నారు. మొదట్లో ఆసుపత్రిలో బెడ్‌ ఇచ్చినా కరోనా తీవ్రత దృష్ట్యా నిరాకరించారు. రెండ్రోజులకు ఒకసారి వెళ్లిరాలేక పగలు, రాత్రి ఆసుపత్రి ఎదురుగా ఉన్న చెట్లకిందే ఉంటున్నారు. మధ్యాహ్నం దాతలు ఆహారం ఇస్తే దాచుకొని రాత్రికి తింటున్నారు.. లేదంటే పస్తులు ఉండాల్సిందేనని రోగుల సహాయకులు ఆవేదన చెందుతున్నారు.

కరోనా వల్ల రోగులు, వారి సహాయకులను ఆస్పత్రి సిబ్బంది లోపలికి అనుమతించటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత భోజన సదుపాయాన్ని ఆసుపత్రుల వద్ద కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: గాంధీలో కేసీఆర్​... రోగులకు ధైర్యం చెప్పిన సీఎం

Last Updated : May 19, 2021, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details