హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో లాక్‌డౌన్ అమలు తీరును నగర జాయింట్ సీపీ, ఈస్ట్‌జోన్ డీసీపీ రమేశ్, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, సీఐ సుబ్బారావు పరిశీలించారు. రాజీవ్ చౌక్ వద్ద వాహనాలను పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు.
అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవు: పోలీసులు - తెలంగాణ వార్తలు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. దిల్‌సుఖ్‌నగర్‌లో లాక్‌డౌన్ అమలు తీరును జాయింట్ సీపీ, ఈస్ట్‌జోన్ డీసీపీ రమేశ్, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, సీఐ సుబ్బారావు పరిశీలించారు.

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
సమయం మించిన తర్వాత రాకపోకలు కొనసాగించిన వాహనాలను నిలిపి వివరాలు సేకరించారు. వాహనదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేశారు. సరూర్‌నగర్, చైతన్యపురిలో కూడా లాక్‌డౌన్ అమలవుతోంది. అనవసరంగా రోడ్లపైకి వచ్చినా, అనుమతిలేని దుకాణాలను తెరిచినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:'జులై వరకూ కరోనా రెండో దశ ఉద్ధృతి'