కూకట్పల్లి అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణీనగర్లోని ఓ రెండంతస్తుల భవనం పక్కన గుంత తవ్వారు. భవనపు ప్రహరీ గోడ కంటే లోతుగా తవ్వటం వల్ల గోడ అవతలివైపు వాలి... పడిపోయే స్థితికి వచ్చింది. ఇది గమనించిన యజమానులు... గోడ పడిపోకుండా ఉండేందుకు కర్రలను సపోర్ట్‌గా నిలిపి ఉంచారు.
గోడ పడిపోకుండా కర్రల సపోర్ట్... స్థానికుల ఆశ్చర్యం
ఓ రెండంతస్తుల భవనం పక్కనే ఉన్న స్థలంలో నిర్మాణం కోసం పెద్ద గుంత తవ్వారు. ప్రహారీ గోడ కంటే లోతుగా తవ్వగా... పడిపోకుండా ఉండేందుకు విచిత్రంగా కట్టెలు సపోర్ట్‌గా ఉంచారు. కనీసం ఆ కట్టెలకైనా బలమైన ఆధారం ఉందా అంటే అదీ లేదు...!
locals shocked after seeing sticks support to compound wall in kukatpally
ఈ దృశ్యాన్ని స్థానికులు వింతగా చూస్తున్నారు. కర్రలతో గోడను మాత్రమేనా... భవనాన్ని కూడా పడకుండా ఆపుతారా...? అంటూ వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. గుంత లోతుగా తీయటం, గోడకు సపోర్ట్‌గా ఉంచిన కర్రలకు బలమైన ఆధారం లేకపోవటాన్ని చూసి... భవనంలో అద్దెకు ఉండేవాళ్లు భయాందోళనకు గురవుతున్నారు.