తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణ ఆర్టీసీలో స్థానికతకే ప్రాధాన్యత

preference for locality in TSRTC jobs మరో నూతన విధానానికి టీఎస్​ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఉద్యోగాల భర్తీలో స్థానికులకే మెుదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. గురువారం జరిగే పాలకవర్గ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించాలని ప్రతిపాదన చేశారు.

By

Published : Aug 20, 2022, 7:51 AM IST

preference for locality in TSRTC jobs
preference for locality in TSRTC jobs

preference for locality in TSRTC jobs: ఉద్యోగాల భర్తీలో స్థానికులకే అగ్రతాంబూలం ఇచ్చేందుకు తెలంగాణ ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. కండక్టర్‌, డ్రైవర్‌, శ్రామిక్‌, కార్యాలయ సిబ్బంది పోస్టులను స్థానికులతో భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యాన్ని మరింత పెంచనుంది. గతంలో ఆయా పోస్టుల భర్తీలో 80 శాతం స్థానికులకు, 20 శాతాన్ని ఇతర జిల్లాల వారికి ఇచ్చే విధానం కొన్నేళ్లుగా సాగుతోంది. నూతన విధానాన్ని తీసుకురావాలంటే ఆర్టీసీ పాలకవర్గం తీర్మానం అనివార్యం.

త్వరలో చేపట్టే ఉద్యోగాల్లో 95 శాతం ఆయా జిల్లాల వారికి ఇవ్వనున్నారు. మిగిలిన 5శాతం స్థానికేతరులకు ఇవ్వనున్నారు. అధికారులు అందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసి దస్త్రాన్ని సిద్ధం చేశారు. కొన్నేళ్లుగా ఆర్టీసీలో ఉద్యోగ విరమణలే కానీ నూతన నియామకాలు చేపట్టిన దాఖలాలు లేవు. త్వరలో కారుణ్య నియామకాలు, వైద్య కారణాలతో వైదొలిగిన వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. త్వరలో ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉంది.

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నూతన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. గురువారం జరగాల్సిన పాలకవర్గ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించాలని ప్రతిపాదించారు. పాలకవర్గంలో సభ్యులుగా ఉన్న పలువురు అధికారులకు అత్యవసర సమావేశాలు ఉండటంతో ఆ భేటీ వాయిదా పడింది. వచ్చే వారం పది రోజుల్లో సమావేశం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details