జడ్పీటీసీలు, ఎంపీటీసీల విజ్ఞప్తులు, సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్థానికసంస్థల ఎమ్మెల్సీలు దృష్టి సారించారు. ఈ మేరకు స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన శాసనమండలి సభ్యులు హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నిధులు, విధులకు సంబంధించిన అంశాలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ను త్వరలో కలిసి వినతిపత్రాలు అందించాలని ఎమ్మెల్సీలు నిర్ణయించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీల సమస్యలపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సమావేశం - telangana latest news
జడ్పీటీసీ, ఎంపీటీసీల సమస్యలపై చర్చించేందుకు... స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు హైదరాబాద్లో సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి విన్నవించాలని నిర్ణయించారు.
![జడ్పీటీసీ, ఎంపీటీసీల సమస్యలపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సమావేశం జడ్పీటీసీ, ఎంపీటీసీల సమస్యలపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10624055-thumbnail-3x2-mlc.jpg)
జడ్పీటీసీ, ఎంపీటీసీల సమస్యలపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సమావేశం
ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, భానుప్రసాదరావు, ఎమ్మెల్సీలు కవిత, మహేందర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, సతీశ్ కుమార్, తేరా చిన్నపరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శంబీపూర్ రాజు, బాలసాని లక్ష్మీనారాయణ హాజరయ్యారు.
ఇదీ చూడండి:'తెరాస సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి'
Last Updated : Feb 14, 2021, 5:29 PM IST