తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో మరో మినీ పురపోరు.. కసరత్తు ప్రారంభం - khammam corporation elections

రాష్ట్రంలో మరో దఫా స్థానిక పోరుకు రంగం సిద్ధమవుతోంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక పూర్తి కాగానే మినీ పురపోరు జరగనుంది. రెండు నగరపాలికలతో పాటు మరో ఐదు పురపాలికలకూ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల పదవులకూ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారభించాయి.

Telangana elections
రాష్ట్రంలో మరో మినీ పురపోరు.. కసరత్తు ప్రారంభం

By

Published : Apr 2, 2021, 5:47 AM IST

రాష్ట్రంలో మరో మినీ పురపోరు.. కసరత్తు ప్రారంభం

రాష్ట్రంలో వరుస ఎన్నికల పర్వం కొనసాగుతూనే ఉంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక పూర్తి కాగానే మినీ పురపోరు జరగనుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైంది.

కొత్తగా ఏర్పాటైన వాటికీ ఎన్నికలు..

వరంగల్, ఖమ్మం, అచ్చంపేట పాలకమండళ్ల పదవీకాలం పూర్తి కావడం వల్ల ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకమండలి గడువు ఈ నెల 15న ముగియనుంది. కొత్తగా ఏర్పాటైన కొత్తూరు సహా జడ్చర్ల, నకిరేకల్​లకూ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం నుంచి ఆ వివరాలు అందిన వెంటనే వార్డుల వారీ ఓటరు జాబితాలు తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ ప్రక్రియను ఏకకాలంలో పూర్తి చేయాలని ఎస్ఈసీ భావిస్తోంది. ఎక్కడైనా పట్టణ ప్రాంతాల్లో ఖాళీలు ఉంటే వాటితో పాటే ఎన్నికలు నిర్వహిస్తారు.

ఖాళీగా ఉన్న స్థానాలూ..

గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎన్నికలు నిర్వహించాల్సిన, ఖాళీగా ఉన్న వివిధ స్థానిక సంస్థల పదవులకూ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్​ఈసీ సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ప్రక్రియను ప్రారంభించింది. ఒక జడ్పీటీసీ, 60 ఎంపీటీసీ, 125 సర్పంచ్ స్థానాలతో పాటు 2288 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆయా స్థానాల్లో వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 12వ తేదీన ఓటర్ల తుదిజాబితాలు ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి ఆ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తారు. వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్​ఈసీ భావిస్తోంది.

ఇవీచూడండి:సాగర్​ ఉపఎన్నిక: గెలుపే లక్ష్యంగా జోరందుకున్న పార్టీల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details