AP New Cabinet: ఏపీలో మంత్రివర్గ కూర్పుపై ఆ రాష్ట్ర సీఎం జగన్ కసరత్తు పూర్తయింది. మూడు రోజులుగా ఈ విషయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పలు దఫాలుగా చర్చించిన సీఎం.. ఈరోజు కూడా సమావేశమయ్యారు. సీఎం జగన్తో భేటీ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ కూర్పుపై సీఎం కసరత్తు ముగిసినట్లు చెప్పారు. సామాజిక సమతుల్యత ఉండేలా నూతన మంత్రివర్గ కూర్పు ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల మేరకు కొత్త మంత్రివర్గం ఉంటుందన్నారు.
'ఏపీలో మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తి.. సామాజిక సమతుల్యత ఉండేలాగా..' - ఏపీ మంత్రి వర్గం
AP New Cabinet: ఏపీలో మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తయింది. సామాజిక సమతుల్యత ఉండేలా నూతన మంత్రివర్గ కూర్పు ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
list-of-ministers-to-the-governor-in-a-sealed-cover
"మంత్రివర్గ కూర్పుపై సీఎం కసరత్తు పూర్తయ్యింది. సామాజిక, ప్రాంతాల సమీకరణాల మేరకు మంత్రివర్గ కూర్పు. సామాజిక సమతుల్యత ఉండేలా మంత్రివర్గం ఉంటుంది. సాయంత్రం 6 గం.కు సీల్డ్ కవర్‌ను గవర్నర్‌కు పంపుతారు. సీఎం స్వయంగా ఫోన్ చేసి ఎమ్మెల్యేలకు వివరాలు చెబుతారు."- సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు
ఇదీ చదవండి: