తెలంగాణ

telangana

ETV Bharat / city

వినాయకుని నిమజ్జనంలో మద్యం​.. చూస్తే షాక్​ అవ్వాల్సిందే? - ఏపీ తాజా వార్తలు

Vinayaka immersion Liquor distribution సాధారణంగా మద్యం అంటే సీసాల్లో ఉంటుంది. పంపిణీ చేయాలనుకున్న వారు బాటిళ్లను పంచిపెడతారు. లేదా గ్లాసుల్లో పోసి ఇస్తుంటారు. ఇక్కడ మాత్రం వెరైటీగా డ్రమ్ముల్లో పోసి, మద్యానికి పంప్ వదిలారు. అది కూడా ఏ పార్టీలో కాదండోయే.. భక్తితో జరుపుకునే వినాయక నిమజ్జనంలో. తాగండి, ఊగండి.. అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్​లో అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Vinayaka immersion
వినాయక నిమజ్జనం

By

Published : Sep 6, 2022, 8:44 PM IST

వినాయక నిమజ్జనంలో మందు ఏరులైపారుతున్న దృశ్యాలు

Vinayaka immersion Liquor distribution: వినాయక చవితి రోజు గణపయ్యను ప్రతిష్ఠించి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఈ నవరాత్రి పర్వదినాలు ఎంతో వైభవంగా జరుపుకుంటాము. అయితే లోకనాయకుడి నిమజ్జనం రోజు మాత్రం చిన్నా, పెద్ద అందరూ ఊర్రూతలూగుతారు. భక్తి శ్రద్దలు, వివిధ నృత్యాలతో అందరినీ అలరిస్తారు. అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన వినాయక నిమజ్జనంలో మాత్రం మద్యం ఏరులై పారింది.

స్థానిక అధికార పార్టీ నాయకులే విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. మామూలుగా అయితే మద్యాన్ని బాటిల్​లో తాగుతారు. లేకపోతే గ్లాస్​లో పోసుకోని సేవిస్తారు. అంతేగానీ డ్రమ్ముల్లో లిక్కర్​ను పోసి పంపిణీ చేయడం ఇక్కడే చూస్తున్నాము. అయితే డ్రమ్ములో మద్యాన్ని నింపి.. నిమజ్జన ఉత్సవాలకి వచ్చిన వారికి ప్రసాదం పంచినట్లుగా పంపిణీ చేశారు.

క్యూ కట్టి మరీ మందుబాబులు పెద్ద ఎత్తున బారులు తీరారు. బహిరంగ మద్యాన్ని అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. దీనికి పక్కనే గానా భజనా సైతం ఉండటంతో ఆహుతులు భారీగా హాజరైయ్యారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొట్టాయి. దీంతో అధికార పార్టీ నేతలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దృశ్యాలు పాతవని ఎక్కడివో తమకి తెలిదని నమ్మబలుకుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details