పురపాలక ఎన్నికల తరువాత తెలంగాణలో మద్యం ధరలు పెరుగుతాయని భావించారు. ఎన్నికలు ఆలస్యం కావటం వల్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరల పట్టికను ఆబ్కారీశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం నాడు విడుదల చేశారు. లిక్కర్ క్వార్టర్‌పై రూ.20లు, హాఫ్‌పై రూ.40లు, ఫుల్ బాటిల్‌పై రూ.80లు, స్ట్రాంగ్ బీరుపై రూ.10, లైట్ బీరుపై రూ.20లు, విదేశీ మద్యం సీసాపై రూ.150ల చొప్పున పెంచినట్లు వెల్లడించారు.
మద్యం అమ్మకాలు..
తెంలగాణలో 2018 జనవరి నుంచి డిసెంబర్ చివరినాటికి వరకు రూ.20వేల కోట్ల విలువైన 3 కోట్ల 33 లక్షల కేసుల లిక్కర్, 4 కోట్ల 85 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. 2019 జనవరి నుంచి డిసెంబర్ 15 వరకు 3 కోట్ల 37 లక్షల కేసుల లిక్కర్, 5 కోట్ల వెయ్యి కేసుల బీర్లు అమ్ముడుపోయి... 21 వేల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ నెలాఖరుకు ఇంకో 15 రోజులు ఉండటం వల్ల మరో వెయ్యి కోట్ల రూపాయల విక్రయాలు జరిగి... ఈ ఏడాది పూర్తయ్యే నాటికి 22 వేల కోట్ల వ్యాపారం జరగుతుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.