రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్యప్రదేశ్ మధ్య భాగం.. దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది.
రాగల మూడు రోజుల పాటు వర్షాలు - తెలంగాణలో మరోసారి వర్షాలు
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాగల మూడు రోజుల పాటు వర్షాలు..!
దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ.. నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉందని పేర్కొంది. రాగల 24 గంటల్లో ఈశాన్యం దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది.