రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఈరోజు కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపునకు వస్తున్నాయని వివరించింది. ఈనెల 11వ తేదీన ఉత్తర మధ్య బంగాళాఖాతం దగ్గరలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది తదుపరి 48 గంటల్లో మరింత బలపడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఇది బలపడితే దాని దశను బట్టి ఎక్కడ వర్షాలు కురుస్తాయో చెప్పొచ్చన్నారు.
Weather Report: 11వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం..! - హైదరాబాద్ వార్తలు
11వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది తర్వాతి 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మరోవైపు గత 4రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నుంచి సిరిసిల్ల, కరీంనగర్, వేములవాడ, వరంగల్ జిల్లాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి భద్రాచలం వరకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దాదాపుగా అన్ని జలాశయాలు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. వీటికి తోడుగా మంజీరాపై ప్రాజెక్టులతో హైదరాబాద్ జంట జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. ఇప్పుడు మళ్లీ అల్పపీడన ప్రభావంతో భారీవర్షాలు పడితే.. మళ్లీ ఇబ్బందులు తప్పవని ముంపు ప్రాంత వాసులు ఆందోళన చెబుతున్నారు.
ఇదీ చదవండి:DALITHA BANDHU: వాసాలమర్రి లబ్ధిదారులకు దళితబంధు నగదు డిపాజిట్