తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో నిందితుల బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ గ్యాస్ లీక్ కేసులో నిందితులైన డైరెక్టర్లు, ఉద్యోగులు దాఖలు చేసిన బెయిలు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది.

vishaka lg polymers issue
విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో నిందితుల బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

By

Published : Aug 1, 2020, 11:28 AM IST

ఏపీలోని విశాఖ శివారు ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ గ్యాస్ లీక్ కేసులో నిందితులైన డైరెక్టర్లు, ఉద్యోగులు దాఖలు చేసిన బెయిలు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి . ఇరువైపు న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం . వెంకటరమణ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని పేర్కొన్నారు.

గ్యాస్ ప్రమాద నేపథ్యంలో పాలిమర్స్ పరిశ్రమకు చెందిన ఉద్యోగులపై గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దక్షిణ కొరియాకు చెందిన వారితో పాటు పలువుర్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో తమకు బెయిలు మంజూరు చేయాలని వారందరూ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు . సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహశీ , సిద్ధార్థ లూత్రా , ఎస్ . నిరంజన్ రెడ్డి వారి తరఫున వాదనలు వినిపించారు . ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపించారు.

ఇవీ చూడం ఇవీ చూడండి:ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details