కరోనా వ్యాక్సిన్లు అందిస్తున్న భారత్ బయోటెక్, సీరం సంస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. చెరో 4.08 కోట్ల డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేయాలని ఆ సంస్థలను ప్రభుత్వం కోరింది. కరోనా వ్యాక్సిన్ల బిల్లులు త్వరగానే చెల్లిస్తామని ఏపీ సర్కారు స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ల సరఫరాపై ఉత్పత్తి సంస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖ
రాష్ట్రానికి సరిపడా కరోనా వ్యాక్సిన్ డోసులను అమ్మాలని భారత్ బయోటెక్, సీరం సంస్థలను ఏపీ ప్రభుత్వం కోరింది. కరోనా వ్యాక్సిన్ల బిల్లులు త్వరగానే చెల్లిస్తామని తెలిపింది. 2.4 కోట్ల మందికి రెండేసి డోసుల చొప్పున వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వ్యాక్సిన్లు అమ్మాలంటూ ఏపీ ప్రభుత్వం లేఖ
రాష్ట్ర అవసరాలకు సరిపడా డోసులను రాష్ట్రానికి అమ్మాలని భారత్ బయోటెక్, సీరం సంస్థలకు విజ్ఞప్తి చేసింది. కేంద్రం నిర్దేశించిన ధరకే వ్యాక్సిన్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2.4 కోట్ల మందికి రెండేసి డోసుల చొప్పున వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించిన మేరకు.. ఆయా సంస్థలకు లేఖ రాసింది.
ఇదీ చదవండి:రియల్ ఎస్టేట్లో ఒడుదుడుకులున్నా... ప్రస్తుతం ఆశాజనకమే..!