తెలంగాణ

telangana

ETV Bharat / city

పిల్లలకు బడి మీద భయాన్ని పోగొట్టేద్దామిలా....

రెండు మూడు రోజుల పాటు ఇంటి దగ్గర ఉంటేనే బడికి వెళ్లేందుకు మారాం చేసే పిల్లలు.. దాదాపు 10 నెలల సెలవు దినాల తర్వాత పాఠశాలలకు పంపించటమంటే గగనమే. బడంటే పిల్లలకు ఏర్పడిన భయాన్ని విద్యార్థుల్లోంచి తొలగించటం కాస్తా కష్టమైన పనే అయినప్పటికీ... కొన్ని పనులు చేయటం వల్ల ఆ భీతిని తొలగించ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూడండి...

Let's get rid of the fear of children in school ....
Let's get rid of the fear of children in school ....

By

Published : Jan 31, 2021, 10:58 AM IST

Updated : Jan 31, 2021, 11:05 AM IST

సంక్రాంతి... వేసవి ఇలా వరుసగా సెలవులు వస్తే పిల్లలు తిరిగి బడికి వెళ్లేందుకు మారాం చేస్తారు. కుంటి సాకులతో పాఠశాల ఎగ్గొట్టేందుకు పథకం వేస్తారు. దాదాపు 10 నెలల విరామం తర్వాత విద్యాలయాలు తెరుచుకోనున్నాయి. గ్రేటర్‌ పరిధిలో 9వ తరగతి నుంచి తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి సమ్మతి తీసుకుంటున్నారు.ఇటువంటి కీలకమైన సమయంలో పిల్లలకు బడి పట్ల భయాన్ని దూరం చేసి మానసికంగా సిద్ధం చేయటం ఉత్తమమార్గమని కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు ఎం.రాంచందర్‌ సూచిస్తున్నారు.

అడ్డంకులు

*కరోనా కారణంగా తలెత్తిన సంఘర్షణ, భయం, ఆందోళన

*ఇంత వరకూ ఉన్న అయోమయం వల్ల విసుగు, నిస్సహాయ స్థితి ● దైనందిన వ్యవహారాల్లో మార్పులు

*ఈ స్థితిలో మెదడులో కార్టిజాల్‌ స్థాయి పెరిగి ఒత్తిడికి కారణమవుతుంది

*పాఠశాలకు దూరమై సుదీర్ఘవిరామం తరువాత వెళ్లటం ఒత్తిడిని పెంచుతుంది.

ఇలా అధిగమిద్దాం

*విద్యార్థులు వీటిని అధిగమించేందుకు ఆన్‌లైన్‌ తరగతులు కొంతమేర ఉపకరించాయి

*ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో సమయాన్ని వృథా చేయకుండా ఆసక్తి/ఇష్టంతో చదవాలి.

*చదివేటపుడు తప్పనిసరిగా విరామం ఉండాలి.

*అధ్యయన అలవాట్లను పెంపొందించుకోవాలి

*ఉదయం/సాయంత్రం ఏదో ఒక సమయంలో వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి.

*భవిష్యత్తుపై సానుకూల ఆలోచనలతో ముందుకెళ్లాలి. జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను ఆలోచనలను దూరం చేయాలి.

అమ్మానాన్నల పాత్ర

*ఇన్నాళ్లు ఇంటివద్దనే ఉన్న పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి

*లక్ష్యాలు విధించి ఒత్తిడికి గురిచేయవద్దు

*విద్యాసంస్థల్లో సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు సహకరించాలి

*ఒత్తిడి లేని స్వేచ్ఛజీవితాన్ని బిడ్డలకు అందించే ప్రయత్నం చేయాలి

*పాఠాలు వినటం/చదవటం వంటి సమస్య తలెత్తితే టీచర్ల దృష్టికి తీసుకెళ్లాలి

*అప్పటికీ పిల్లలు మొండిగా, మౌనంగా ఉన్నట్టయితే మనస్తత్వ నిపుణులను సంప్రదించండి.

ఉపాధ్యాయులు నింపే ధైర్యం

*ఒక్కసారి ఒడిలోకి చేరాక గురువుల మాటే విద్యార్థులకు వేదవాక్కు.

* పిల్లల అనుమానాలను నివృత్తి చేసి భరోసా నింపే బాధ్యత స్వీకరించాలి.

*సిలబస్‌కు సంబంధించిన అంశాలపై స్పష్టతనివ్వాలి .

*ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా కొందరు పాఠాలు మరచిపోవటం/వినకపోవటం చేసి ఉంటారు. వారిని గుర్తించి ప్రోత్సహించటం ద్వారా ఆశించిన ఫలితం సాధించవచ్చు.

*పిల్లల్లో ఆత్మవిశ్వాసం కలిగించేలా నిపుణుల పర్యవేక్షణలో ప్రేరణ సదస్సులు నిర్వహించాలి.

ఇదీ చూడండి:ఉపాధ్యాయుల కొరతను అధిగమించేదెలా?

Last Updated : Jan 31, 2021, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details