తిరుమల మొదటి కనుమ దారిలో వేకువజామున చిరుతపులి సంచారం(Leopard Wandering In Tirumala) ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. కొండపై నుంచి కిందకు దిగే మొదటి ఘాట్ రోడ్డులో వినాయకస్వామి ఆలయం వద్ద చిరుత రోడ్డు(Leopard Wandering In Tirumala)పైకి వచ్చింది. వాహనం రాకతో ఘాట్ రోడ్డులో కొంత దూరం పరిగెడుతూ పిట్టగోడను దూకి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.
Leopard Wandering In Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం - ఏపీలో చిరుత సంచారం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం(Leopard Wandering In Tirumala) ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. అయినప్పటికీ వారంతా చిరుతను సెల్ఫోన్లో చిత్రీకరించారు.

తిరుమలలో చిరుత సంచారం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం
చిరుతను గమనించిన ప్రయాణికులు(Leopard Wandering In Tirumala).. సెల్ఫోన్లలో చిత్రీకరించారు. కొన్ని రోజులుగా కపిలతీర్థం, దివ్యారామం సమీప అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది.
ఇదీ చూడండి:Minister KTR on ponds: 'చెరువులను పరిరక్షిస్తాం... ఆక్రమణలు జరగనివ్వం'