దుండిగల్ శివారులో చిరుతపులి కలకలం - చిరుతపులి కలకలం
18:50 September 07
దుండిగల్ శివారులో చిరుతపులి కలకలం
Leopard spoted: మేడ్చల్ జిల్లా దుండిగల్ పురపాలిక పరిధిలోని శివారు ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గండి మైసమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీ శ్లోక స్కూల్ ఉంది. ఈ స్కూల్ వెనుక భాగంలో ఉన్న నిర్జన ప్రదేశంలో చిరుతను చూసినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. వెంటనే భయాందోళనలతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుత సంచరించిన అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
వీరికి స్థానిక పోలీసులు సహాయం అందించారు. వీరి ఇరువురు అరణ్యాన్ని మెుత్తం జల్లెడ పట్టారు. చిరుత పులికి సంబంధించిన పాదముద్రలు వంటి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. దీంతో అధికారులు ప్రాథమికంగా చిరుత సంచరించలేదని నిర్ధారించారు. దీంతో స్థానికులు, స్కూల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: