ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా సున్నిపెంటలోని చిరుత పులి మృతదేహం కనిపించింది. ఈద్గా సమీపంలో చిరుతపులి మృత కళేబరాన్ని గుర్తించిన అటవీశాఖ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. మృతి చెందిన చిరుత వయస్సు సుమారు ఒకటిన్నర సంవత్సరం ఉండొచ్చని, ఘటన జరిగి పది రోజులవుతుందని తెలిపారు.
రేచు కుక్కల దాడిలో చిరుత మృతి - కర్నూలు జిల్లాలో చిరుత మృతి
రేచు కుక్కల దాడిలో ఏపీలోని కర్నూలు జిల్లా సున్నిపెంట అటవీ ప్రాంతంలో చిరుతపులి మృతి చెందింది. పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

రేచుకుక్కల దాడిలో చిరుత మృతి
చిరుతపులి మృత కళేబరానికి పంచనామా నిర్వహించి దహనం చేశారు. ఆత్మకూరు డీఎఫ్‌వో డి.ఎ.కిరణ్, సబ్ డీఎఫ్‌వో విఘ్నేష్ అప్పావు, తహసీల్దారు రాజేంద్రసింగ్, పశువైద్యాధికారి ఎల్.వి.నారాయణరెడ్డి, అటవీ రేంజ్ అధికారి నరసింహులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కొండారెడ్డి ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు.
ఇదీ చదవండి:ఇయర్ రిపోర్ట్: నేరాలు తగ్గాయ్.. శిక్షలు పెరిగాయ్: మహేశ్ భగవత్