కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు వ్యతిరేకంగా వామపక్ష కార్మిక సంఘాలు హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. ప్రభుత్వ బ్యాంకుల విలీనాలు, రైల్వే ప్రైవేటీకరణ, రక్షణ రంగ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎయిర్ ఇండియా అమ్మకాలు, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ సంస్థల కార్పొరేటీకరణ తదితర నిర్ణయాలు దేశ ఆర్థిక స్వావలంబనకు, సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే నిర్ణయాలని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా వామపక్షల ధర్నా - aituc latest news
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు ఆందోళనకు దిగాయి. మోదీ నిర్ణయాలు దేశ ఆర్థిక స్వాలంబనకు.. సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు.
left parties protest