తెలంగాణ

telangana

ETV Bharat / city

'మోదీ విధానాలతో దేశ ఆర్థిక ప్రగతి ఆగిపోయింది'

ప్రధాని మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ఆర్థిక ప్రగతి ఆగిపోయిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ అన్నారు. దిల్లీలో ఈ నెల 10 నుంచి వామపక్ష పార్టీలు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

'మోదీ విధానాలతో దేశ ఆర్థిక ప్రగతి ఆగిపోయింది'

By

Published : Oct 16, 2019, 8:31 PM IST

దేశంలో ప్రధాని మోదీ పాలనలో ఆర్థిక మాంద్యం, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారంటూ వామపక్ష పార్టీలు దిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్​లో ధర్నా చేపట్టాయి. ఈ నెల 10 నుంచి చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు అన్ని వామపక్ష పార్టీల నేతలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని.. ప్రైవేటీకరణ వైపు కేంద్రం అడుగులు వేస్తుందని మండిపడ్డారు. తక్షణమే అలాంటి నిర్ణయాలను వెనక్కితీసుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వ్యవరిస్తోందని.. ప్రధాని మోదీ విధానాలతో ఆర్థిక ప్రగతి ఆగిపోయిందని సీపీఐ నేత నారాయణ అన్నారు.

'మోదీ విధానాలతో దేశ ఆర్థిక ప్రగతి ఆగిపోయింది'

ABOUT THE AUTHOR

...view details