మాజీమంత్రి ముఖేశ్ గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. బడుగు, బలహీనవర్గాల తరఫున పోరాడిన నేతగా లక్ష్మణ్ కొనియాడారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేశ్ సంతాపం తెలుపుతూ... ట్వీట్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, తెదేపా సీనియర్ నాయకులు దేవేందర్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ముఖేశ్ గౌడ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ముఖేశ్‌గౌడ్ మృతికి రాజకీయ ప్రముఖుల సంతాపం - thalasani srinivas yadav
మాజీమంత్రి ముఖేశ్ గౌడ్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మంగళవారం ఉదయం ఆయన భౌతికకాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ముఖేశ్‌గౌడ్ మృతికి రాజకీయ ప్రముఖల సంతాపం