ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులు కూల్చివేయాలని, ట్యాంక్ బండ్‌పై ఉన్న విగ్రహాలను తొలగించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకతీతంగా తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడానికి పూనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. సమున్నత గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నెలకొల్పిన స్థలాలను, విగ్రహాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే వాటిని ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసన్నారు.
మహనీయుల విగ్రహాల జోలికి వస్తే సహించం: సుధీర్‌రెడ్డి - గ్రేటర్ ఎన్నికలు
మహనీయుల విగ్రహాల జోలికి వస్తే సహించమని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడానికి పూనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మహనీయుల విగ్రహాల జోలికి వస్తే సహించం: సుధీర్‌రెడ్డి
ఇలాంటి నీచమైన దిగజారుడు ధ్వంసరచనకు ప్రజాస్వామ్యంలో తావులేదన్నారు. పిచ్చి ప్రేలాపనలు చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులుగా రాణించాలని.. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఇవీ చూడండి: కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి: కేటీఆర్