సచివాలయ ప్రాంగణంలో నిర్మించే గుడి, మసీదు, చర్చిల నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మసీదు నిర్మాణానికి ఫిబ్రవరి 26వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, ముస్లిం ప్రజాప్రతినిధులు, మతపెద్దలతో బీఆర్కే భవన్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప లౌకికవాది అని ... అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని మంత్రులు తెలిపారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాల నిర్మాణం విషయంలో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీనిచ్చారు. మరోమారు సమావేశం నిర్ణయించి నమూనాలు సహా సంబంధిత అంశాలపై చర్చించనున్నారు.