తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. మృతుడు వామనరావు తండ్రి కిషన్ రావు.. పెద్దపల్లి పోలీసులకు కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం.
జడ్పీ ఛైర్మన్ పుట్టమధుపై అనుమానం : కిషన్ రావు - interesting facts in lawyers murder case
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక విషయాలను మృతుడు వామన్రావు తండ్రి కిషన్ రావు పోలీసులకు వెల్లడించారు. పక్కా ప్రణాళికతోనే తమ కుమారుడు-కోడలిని హత్య చేసినట్లు తెలిపారు.
వామనరావు దంపతుల హత్య కేసులో కీలక అంశాలు
పక్కా ప్రణాళికతో తమ కుమారు-కోడలిని హత్య చేశారని పోలీసులకు కిషన్ రావు తెలిపారు. హత్యకు ముందు పూదరి లచ్చయ్య అనే వ్యక్తి రెక్కీ నిర్వహించారని చెప్పారు. వారిని చంపేందుకు వచ్చిన కారును వదిలి నిందితులు మరో కారులో పరారయ్యారని వెల్లడించారు.
న్యాయవాద దంపతుల హత్య కేసులో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుపై వామన్రావు తండ్రి కిషన్ రావు అనుమానం వ్యక్తం చేశారు. అతణ్ని కూడా తప్పకుండా విచారించాలని పోలీసులను కోరారు.
- ఇదీ చూడండి :హైకోర్టు న్యాయవాదుల హత్యపై ఎఫ్ఐఆర్ నమోదు