తెలంగాణ

telangana

ETV Bharat / city

Vaccine drive: కొన‌సాగుతున్న మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ - corona vaccination drive for it employees

హైదరాబాద్​లో మెగా కరోనా వ్యాక్సినేషన్​ డ్రైవ్ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్‌ పోలీసులు, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మెడికవర్‌ ఆసుపత్రులు ఈ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాయి.

mega vaccination drive at hyderabad
హైదరాబాద్​లో అతిపెద్ద వ్యాక్సినేషన్​ డ్రైవ్​ ప్రారంభం

By

Published : Jun 6, 2021, 8:59 AM IST

Updated : Jun 6, 2021, 11:58 AM IST

క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో భాగంగా హైదరాబాద్​ న‌గ‌రంలో అతిపెద్ద వ్యాక్సినేష‌న్ డ్రైవ్ కొన‌సాగుతోంది. తొలిగంట‌లో 5 వేల మంది వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఒకేచోట 40 వేల మందికి టీకా ఇచ్చేందుకు చేస్తున్న ఈ డ్రైవ్‌ దేశంలోనే మొదటిసారి కావడం గమనార్హం. ఇందుకు హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ కేంద్రం వేదిక అయింది. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్‌ పోలీసులు, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మెడికవర్‌ ఆసుపత్రులు ఈ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాయి.

ఈ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల దాకా జరిగే ఈ డ్రైవ్‌లో ఐటీ ఉద్యోగులు, గేటెడ్‌ కమ్యూనిటీలు పాల్గొనే అవకాశముంటుంది. మెడిక‌వ‌ర్‌ ఆసుపత్రుల‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పేరు న‌మోదు చేసుకున్న వారికే టీకా పొందేందుకు అవ‌కాశం ఉంది.

కొవిడ్ టీకా తీసుకునేందుకు ఇటీవ‌ల‌ ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నగరవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల్లో వాహకులుగా గుర్తించిన వారికి టీకాలు వేయిస్తోంది. పలు కేంద్రాల్లో రెండో డోసు టీకాలూ వేస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో వందల మంది నివసించే ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రులు టీకా డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. మరోవైపు పలుచోట్ల మెగా టీకాల డ్రైవ్‌లు పెద్దఎత్తున సాగుతున్నాయి.

ఇవీచూడండి:Vaccine : వ్యాక్సిన్​ను భుజం కండరానికే ఎందుకు వేస్తారో తెలుసా?

Last Updated : Jun 6, 2021, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details