మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పీఎస్ వద్ద భాజపా శ్రేణుల ధర్నాకు దిగారు. ఆదివారం రాత్రి భాజపా కార్యకర్తలపై తెరాస నేతలు దాడి చేశారని ఆరోపించారు. తెరాస కార్పొరేటర్ జగన్, అతని అనుచరులు దాడి చేశారని, వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మేడ్చల్ అర్బన్ జిల్లా భాజపా అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, భాజపా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంతసేపటికి వారు మాట వినకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి అక్కడున్న కార్యకర్తలను చెదరగొట్టారు.
జగద్గిరిగుట్ట పీఎస్ వద్ద భాజపా నిరసన.. పరిస్థితి ఉద్రిక్తం - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు
మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట కార్పొరేటర్... అనుచరులతో కలిసి తమపై దాడిచేశారని స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట భాజపా శ్రేణులు నిరసన చేపట్టారు. తెరాస నేతలను అరెస్టు చేయాలని ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.
జగద్గిరిగుట్ట పీఎస్ వద్ద భాజపా నిరసన.. పరిస్థితి ఉద్రిక్తం
తెరాస కార్పొరేటర్ రాత్రి సిగరెట్ తాగుతుండగా.. జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ నుంచి తమకు ప్రాణహనీ ఉందని... రక్షణ కల్పించాలని బాధిత మహిళ విజ్ఞప్తి చేస్తోంది.
ఇవీ చూడండి:సాంకేతికతను వినియోగించుకోవడంలో మనమే ఫస్ట్