ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన శేషగిరిరావు రెండు దశాబ్దాలకు పైగా లెదర్ బ్యాగులు, బెల్ట్ ఉత్పత్తులు తయారుచేసే యూనిట్లను నడుపుతున్నారు. దిల్లీ ఐఐటీ ఈ ఎంటర్‌ప్రెన్యూర్ సెల్ మాజీ సభ్యుడు కేవీ రమణ, ఏయూ పోస్ట్ డాక్టరల్ ఫెలో దేముడుతో కలిసి ఈ నానో మాస్క్‌ను అభివృద్ధి చేశారు. నానో ఫోటానిక్ ఫిల్టర్ మాస్క్- 99 అని దీనికి పేరు పెట్టారు.
ఇది నానో మెటీరియల్‌తో తయారవుతుందని... ఎలాంటి వైరస్‌నైనా చంపుతుందిని శేషగిరిరావు తెలిపారు. ఒక్క మాస్క్ కాల పరిమితి ఆరు నెలలు ఉంటుందని వివరించారు. ప్రత్యేకమైన ఈ మాస్క్ వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తుందని... మానవ శరీరానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక లేయర్లను మాస్క్‌పై ఏర్పాటు చేసినట్లు చెప్పారు.