ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 70,757 పరీక్షలు నిర్వహించగా.. 1,859 కేసులు నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 19,88,910 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 13 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
AP corona cases: ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు..13 మరణాలు
ఏపీలో కొత్తగా 1,859 కేసులు నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 19,88,910 మంది వైరస్ బారిన పడ్డారు.
కరోనా కేసులు
మొత్తం మృతుల సంఖ్య 13,595కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,575 మంది బాధితులు కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,56,627కి చేరినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 18,688 యాక్టివ్ కేసులున్నాయి. ఆ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,54,53,520 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:Warangal Mayor: అరగంటసేపు లిఫ్ట్లోనే మేయర్.. చెమటలు కక్కుతూ బయటకు..