ఏపీలో గడచిన 24 గంటల్లో 81,740 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,345 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 16 మరణించారని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
AP CORONA CASES: కొత్తగా 2,345 కరోనా కేసులు, 16 మరణాలు
ఏపీలో కొత్తగా 2,345 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 16 మంది మృతిచెందారని.. ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
ap corona cases
ఏపీలో కొవిడ్ నుంచి మరో 3,001 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 24,854 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ ప్రభావంతో.. గుంటూరు జిల్లాలో 3, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశంలో ఇద్దరు చొప్పున, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,33,96,437 మంది నమూనాలు పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.