తెలంగాణ

telangana

ఏపీలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

By

Published : Oct 23, 2020, 10:53 PM IST

ఏపీలో శుక్రవారం కొత్తగా 3765 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. ఇప్పటివరకు మెుత్తం 74.28 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.

ap corona news
ఏపీలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 8 లక్షలు దాటాయి. శుక్రవారం.. 3,765 మందికి కొవిడ్‌ సోకినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి బాధితుల సంఖ్య 8,00,684కు చేరింది. ఏపీలో కరోనాతో మరో 20 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు వైరస్ కారణంగా 6,544 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు 7,62,419 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 31,721 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 80,238 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు మెుత్తం 74.28 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.

జిల్లాల వారీగా కేసులు...

పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 532 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు 523, తూర్పుగోదావరి 475, కృష్ణా 460, చిత్తూరు 347, ప్రకాశం 317, కడప 225, విశాఖ 218, శ్రీకాకుళం 199, అనంతపురం 152, విజయనగరం 126, నెల్లూరు 122, కర్నూలు 69 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలు...

గుంటూరు 4, కడప 3, కృష్ణా 3, అనంతపురం 2, చిత్తూరు 2, తూర్పుగోదావరి 2, కర్నూలు 1, ప్రకాశం 1, విశాఖ 1, పశ్చిమగోదావరి ఒకరు చొప్పున ప్రాణాలు విడిచారు.

ఇవీచూడండి:'కరోనాను ఎదుర్కొనేందుకు అనేక పరిశోధనలు.. ఆవిష్కరణలకు ప్రాణం'

ABOUT THE AUTHOR

...view details