ఏపీలో గడిచిన 24 గంటల్లో 43,770 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 158 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,86,852కు చేరింది. గడిచిన 24 గంటల్లో వైరస్ బారినపడి విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,147కు చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో కొత్తగా 158 మందికి కరోనా.. ఒకరు మృతి - కరోనా వార్తలు
ఏపీలో కొత్తగా 158 మందికి కరోనా సోకింది. 24 గంటల వ్యవధిలో విశాఖ జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
![ఏపీలో కొత్తగా 158 మందికి కరోనా.. ఒకరు మృతి latest-corona-bulletin-released-by-state-government-158-new-cases-registered-in-the-state-and-on-died-in-visakhapatnam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10354618-1082-10354618-1611411055562.jpg)
ఏపీలో కొత్తగా 158 మందికి కరోనా
తాజాగా 172 మంది వైరస్ నుంచి కోలుకున్నట్టు ఏపీ వైద్యారోగ్య శాఖ పేర్కొంది. వీరితో కలిపి మొత్తం 8.78 లక్షల మందికి పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 28 లక్షలు దాటాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి :12 రాష్ట్రాలకు వ్యాపించిన బర్డ్‌ఫ్లూ