Police Job Application : రాష్ట్ర పోలీసు శాఖలో ఈనెల 2న ప్రారంభమైన వివిధ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అభ్యర్థులు ఇవాళ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. పోలీసు శాఖ మొత్తం 17,291 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ ఉద్యోగాలకు ఇప్పటికే 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ చివరి రోజు కావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పోలీస్ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు - తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తులు
Police Job Application : పోలీసు ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇవాళ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 17వేల 291 ఉద్యోగాలకు పోలీసు శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే 13 లక్షల మంది వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.
Police Job Application
వయో పరిమితి మరో రెండేళ్లు పెంచడంతో పోలీసు శాఖ ఉద్యోగాలకు దరఖాస్తులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 7న ఎస్ పరీక్ష, 21న కానిస్టేబుల్ పరీక్షలు జరిగే అవకాశముందని వెల్లడించారు. సర్వర్లలో సాంకేతిక సమస్యలు రాకుండా అధికారులు సామర్థ్యం పెంచడంతో.. అభ్యర్థులు ప్రశాంతంగా ఉద్యోగాలకు అప్లై చేశారు. వచ్చే మార్చికల్లా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.