తెలంగాణ

telangana

ETV Bharat / city

King Cobra: 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. హడలిపోయిన జనం - అనకాపల్లి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం

King Cobra In Anakapalli: ఏపీలో అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో 12 అడుగుల ఓ కింగ్ కోబ్రా.. జనాలను కంగారు పెట్టించింది. ఈ భారీ పామును బందించేందుకు చాలా ఆవస్థలు పడాల్సి వచ్చింది. చివరకు వన్యప్రాణి సంరక్షణ సభ్యులు.. పామును పట్టుకుని సురక్షితంగా అటవీలో వదిలిపెట్టారు. దీంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు.

కింగ్ కోబ్రా
కింగ్ కోబ్రా

By

Published : Sep 15, 2022, 6:59 PM IST

King Cobra In Anakapalli: 12 అడుగుల భారీ కింగ్​ కోబ్రాను చూసిన ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కాశీపురం శివారు లక్ష్మిపేటలో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భారీగా ఉన్న పామును చూసిన జనం భయపడిపోయారు. ఓ మరుగుదొడ్డిలో కింగ్​ కోబ్రా కనిపించడంతో గ్రామంలో ఒక్కసారిగా కలవరం చోటు చేసుకుంది. దీంతో వారు వన్యప్రాణి సంరక్షణ సభ్యులకు సమాచారం అందించారు.

సమాచారం తెలుసుకున్న ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు దాన్ని పట్టుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. చివరకు సురక్షితంగా సంచిలో బంధించి వంట్ల మామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉపిరిపిల్చుకున్నారు.

12 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. హడలిపోయిన జనం

ABOUT THE AUTHOR

...view details