తిరుమల మొదటి కనుమ దారిలో ఏనుగులు సంచరించిన ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏనుగులు రహదారిపైకి రావడం వల్ల అధికారులు... ఏనుగులు వెళ్తున్న దారిపై ఆరా తీస్తున్నారు.
తిరుమల దారిలో గజరాజులు.. జాగ్రత్త చర్యల్లో అధికారులు
తిరుమల మొదటి కనుమ దారిలో పెద్ద సంఖ్యలో ఏనుగులు సంచరించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కనుమ దారిలో ఏనుగులు సంచరించడంపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. సోమవారం నుంచి భక్తుల దర్శనానికి తితిదే అనుమతించడంతో.. ఏనుగులు మరలా రహదారిపైకి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టిపెట్టారు.
తిరుమల దారిలో గజరాజులు.. జాగ్రత్త చర్యల్లో అధికారులు
సోమవారం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తుండడం వల్ల ఏనుగులు మరలా రహదారిపైకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గజరాజుల గుంపు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉందనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇవీ చూడండి:దక్షిణ అయోధ్యలో దర్శనాలకు వేళాయే..