తెలంగాణ

telangana

ETV Bharat / city

మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు! - telangana news 2021

రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి.. దేవరయంజాల్​ దేవాలయ భూమి కబ్జాకు పాల్పడ్డారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ ఆరోపించారు. మల్లారెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

భాజపా కార్యవర్గ సభ్యుడు, భాజపా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ, మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు

By

Published : May 4, 2021, 3:26 PM IST

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దేవరయంజాల్ భూముల కబ్జాకు పాల్పడ్డారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు

ఈటల రాజేందర్​పై చర్యలు తీసుకున్నట్లుగానే.. మంత్రి మల్లారెడ్డిపై కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని రామకృష్ణ సీఎం కేసీఆర్​ను కోరారు. మల్లారెడ్డిని కూడా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి నివాసంతో పాటు ఇంటి పక్కన ఉన్న రెండువేల గజాల స్థలం కూడా కబ్జా చేశారని ఆరోపించారు.

కళాశాలల పేరుతో చెరువులు, అసైన్డ్ భూములను కబ్జా చేశారని రామకృష్ణ ఆరోపించారు. వెంటనే వాటిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని కోరారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన భూకబ్జా వివరాలు, వాటి ఆధారాలను సీఎం కార్యాలయానికి పంపిస్తున్నట్లు తెలిపారు. వెంటనే సమగ్ర విచారణ చేపట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details