తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆరోగ్యం కోసం ప్రతి రోజు కొంత సమయం' - శంషాబాద్‌ వార్తలు

శంషాబాద్‌లో బ్రహ్మ కుమారి రాజా యోగ సెంటర్ వారి నూతన భవన నిర్మాణానికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భూమి పూజ చేశారు. ప్రతి రోజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయాన్ని ఆరోగ్యం కోసం కేటాయించాలని ఎంపీ సూచించారు.

land ceremony for construction of new building of Brahma Kumari Raja Yoga Center at shamshabad
'ఆరోగ్యం కోసం ప్రతి రోజు కొంత సమయం'

By

Published : Jan 19, 2021, 10:48 PM IST

ధ్యానం అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని శంషాబాద్ వద్ద బ్రహ్మ కుమారి రాజా యోగ సెంటర్ వారి నూతన భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి రంజిత్ రెడ్డి భూమి పూజ చేశారు.

కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం ప్రాముఖ్యత తెలిసిందన్నారు. ప్రతి రోజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయాన్ని ఆరోగ్యం కోసం కేటాయించాలని ఆయన సూచించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి కృషి చేస్తున్న బ్రహ్మకుమారి సమాజానికి తన వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ ఛైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, బ్రహ్మ కుమారి సమాజ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కార్పొరేట్​ సామాజిక బాధ్యతతో ఎస్పీఐ కార్యకలాపాలు : దినేశ్​ ఖారా

ABOUT THE AUTHOR

...view details