పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్‌కు ఏపీ ప్రభుత్వం భూమి కేటాయించింది. విశాఖ గ్రామీణ మండలం చినగదిలిలో భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే నం.72, 83లో 2 ఎకరాలు అకాడమీకి కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రజాప్రయోజనాల రీత్యా భూమి ఉచితంగా కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
PV Sindhu: పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ కోసం రెండెకరాలు కేటాయింపు - ఏపీలో పీవీ సింధు అకాడమీ
పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్‌కు ఏపీ ప్రభుత్వం విశాఖ గ్రామీణ మండలం చినగదిలిలో భూమి కేటాయించింది. సర్వే నం.72, 83లో 2 ఎకరాలు అకాడమీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అకాడమీకి సింధు రూ.5 కోట్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెండు దశల్లో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం జరగనుంది. పేద పిల్లల్లో ప్రతిభ గుర్తించి ప్రోత్సాహం అందించాలని ఏపీ సర్కారు సూచించింది. క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఆ రెండు ఎకరాలను పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ కోసం ఇస్తోంది. అకాడమీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మూడేళ్ల కాలానికి ఐటీ రిటర్నులు సమర్పించడమే కాకుండా నిబంధనల ప్రకారం మిగతా షరతులన్నీ పూర్తయ్యాక ఆ భూమిని పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి బదలాయించారు.
ఇదీ చూడండి: CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,492 కరోనా కేసులు, 13 మరణాలు