తెలంగాణ

telangana

ETV Bharat / city

వర్షానికి నీటిమయమైన రహదారి.. నడుస్తూ గుంతలో పడిపోయిన మహిళ - Hyderabad Rains

Lady Fell in Rain Water: హైదరాబాద్​లో చినుకు పడితే చాలు.. వాహనదారులు, పాదాచారుల్లో వణుకు మొదలవుతోంది. చలికి కాదండోయ్​.. రోడ్ల మీద వెళ్లాలంటే..! ఎక్కడ ఏ గుంత కాలులాగేస్తుందో..? ఏ నాలా మింగేస్తుందో..? అని జంకుతున్నారు. సికింద్రాబాద్​లో కురుస్తోన్న వర్షానికి ఓ మహిళ.. గుంతలో పడిపోయింది.

LADY FELL DOWN IN RAIN WATER AT MACCHABOLLARAM
LADY FELL DOWN IN RAIN WATER AT MACCHABOLLARAM

By

Published : Jun 28, 2022, 8:42 PM IST

Lady Fell in Rain Water: సికింద్రాబాద్​ అల్వాల్ సర్కిల్ పరిధిలో కురుస్తున్న వర్షంతో రహదారులు చెరువులయ్యాయి. సుమారు గంటకు పైగా కురిసిన వర్షంతో.. ఎక్కడ ఏ గుంత ఉందో..? ఏ స్పీడ్​ బ్రేకర్​ ఉందో..? తెలియనంతగా.. రహదారులు నీటిమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నడిచేందుకు కూడా వీలులేకపోవటంతో.. పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారుల పరిస్థితి చెప్పనవసరమే లేదు.

అయితే.. మచ్చబొల్లారంలోని అంజనీపూరి కాలనీలో వరద నీటితో రహదారి నిండిపోయింది. అదే సమయంలో.. మంజుల అనే మహిళ అటుగా నడుచుకుంటూ వెళ్లింది. చాలా జాగ్రత్తగా.. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తోంది. నీటితో పూర్తిగా నిండిపోయిన రహదారిపై ఎక్కడ ఏముందో కనిపించకపోవటంతో ఆ మహిళ ప్రమాదవశాత్తు ఓ గుంతలో పడిపోయింది. అది ఇంటి నిర్మాణం కోసం తీసిన గోతి కావటంతో.. మహిళ నీటిలో పూర్తిగా మునిగిపోయింది. అదే సమయంలో అక్కడున్న స్థానికులు.. మహిళ పడిపోవటాన్ని గ్రహించి వెంటనే ఆమెను పైకి లేపి రక్షించారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.

సికింద్రాబాద్​లోని చిలకలగూడ, బోయిన్​పల్లి, మారేడ్​పల్లి, ప్యాట్నీ, ప్యారడైస్, తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాలలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి.. చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు, పాదచారులు.. ఆ రోడ్ల వెంట వెళ్లేందుకు జంకుతున్నారు.

వర్షానికి నీటిమయమైన రహదారి.. నడుస్తూ గుంతలో పడిపోయిన మహిళ

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details